ETV Bharat / state

సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం: కోనేరు కోనప్ప - MLA Koneru Konappa who participated in the municipal council meeting

పాలకవర్గం, అధికారులు కలిసి పనిచేస్తేనే కాగజ్​నగర్ పట్టణం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పురపాలిక మాజీ ఛైర్మన్ గుళ్లపల్లి బుచ్చిలింగం స్మారకార్థం వినయ్ గార్డెన్డ్ రహదారికి నామకరణం చేయాలని సూచించారు. పురపాలిక సంఘం సమావేశంలో పాల్గొన్నారు.

MLA Koneru Konappa participated in the governing body meeting
పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
author img

By

Published : Dec 31, 2020, 5:39 PM IST

కాగజ్​నగర్ పట్టణం.. పాలకవర్గం, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన జరిగిన పురపాలిక సంఘం సమావేశంలో పాల్గొన్నారు. పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులు ఆమోదించారు.

సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్​ను కలిసినప్పుడు పట్టణంలో నెలకొన్న సమస్యలు వివరించానని తెలిపారు. అభివృద్ధికి చేపట్టాల్సిని పనులను తెలియజేశానని పేర్కొన్నారు. దాంతో వారు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఎమ్మెల్యే కొనప్పను ఛైర్మన్ సద్దాం హుస్సేన్, పాలకవర్గ సభ్యులు శాలువతో సన్మానించారు.

పురపాలిక మాజీ చైర్మన్ దివంగత గుళ్లపల్లి బుచ్చిలింగం స్మారకార్థం వినయ్ గార్డెన్డ్ రహదారికి నామకరణం చేయాలి. ఆయన హయాంలో పట్టణం అభివృద్ధి చెందింది. ఆయన సేవలను స్మరించుకోవడం మన బాధ్యత.

-కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే

ఇదీ చూడండి: సీఎం చర్చలకు ఆహ్వానించడంపై ఉద్యోగ సంఘాల నేతల హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.