కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు ప్రాజెక్టు కుడి కాలువకు... ఎమ్మెల్యే ఆత్రం సక్కు నీటిని విడుదల చేశారు. ఖరీఫ్ కాలం ప్రారంభమైనందున... ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు.
రైతులు నీటిని ఉపయోగించుకొని పంటలు పండించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి