కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ గ్రామంలో ఆదీవాసీల సంప్రదాయ వివాహ వేడుక ఆకట్టుకుంది. డోలు వాయిద్యాల నడుమ పెళ్లికొడుకు గుర్రంపై రావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆదీవాసీలు సంప్రదాయ వేషాధారణతో, నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
ఈ వివాహ వేడుకకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కుటుంబసమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించి.. కానుకలు అందజేశారు. ఈ వివాహానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు హాజరయ్యారు.
ఇదీ చదవండి: వేసవిలో సేద తీరుతున్న అందాల భామలు!