ETV Bharat / state

'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది' - ఆసిఫాబాద్​ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ, సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ప్రభుత్వం నిర్మిస్తోందని కుమురంభీం ఆసిఫాబాద్​ జడ్పీ ఛైర్​పర్సన్​, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో రైతు వేదిక నిర్మాణానికి వారు భూమిపూజ చేశారు.

mla and zp chairperson laid foundation for the farmer's platform in kumurambheem asifabad district
'రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది'
author img

By

Published : Jul 10, 2020, 10:42 PM IST

రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా పరిషత్​ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని జనకపూర్ వద్ద రైతు వేదిక నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జడ్పీ ఛైర్​పర్సన్​ భూమి పూజ చేశారు. రైతులకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సంబంధ సూచనలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి క్లస్టర్​లో రైతు వేదికలు నిర్మిస్తోందన్నారు.

ఉపాధి హామీ పథకం, వ్యవసాయ శాఖ నిధులతో వేదికలు నిర్మిస్తోందని తెలిపారు. అన్నదాతలు రైతువేదికలను సక్రమంగా ఉపయోగించుకొని లాభదాయక పంటలు పండించాలని అన్నారు.

ఇవీ చూడండి: రేణికుంటలో రైతు వేదిక శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.