కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ... వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మిషన్ భగీరథతో తాగునీరు అందించి... వారి కష్టాలు తీర్చారని తెలిపారు. త్వరలో రూ.40 కోట్లతో జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్కు, 1/70 చట్టంలో ఉన్న ఏజెన్సీ భూములకు ఎలాంటి సంబంధమూ లేదని మంత్రి తెలిపారు. అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు... పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రైతు బాంధవుడు సీఎం కేసీఆర్: మంత్రి సబిత