విధి నిర్వహణలో ఉండగా అమరుడైన జవాన్ షాకీర్ హుస్సేన్ కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. జవాన్ మృతి పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన జవాన్ షాకీర్ హుస్సేన్.. దేశ సరిహద్దులోని లద్దాఖ్‌లో అక్టోబరులో ప్రమాదవశాత్తు మరణించాడు. విధులు నిర్వహించి బేస్ క్యాంప్‌కు తిరిగి వస్తుండగా.. కొండచరియలు విరిగి వాహనంపై పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో షాకీర్ అక్కడికక్కడే మరణించాడు.
జవాన్ షాకీర్‌కు భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. షాకిర్ భార్యకు ఉద్యోగం కల్పించాలని అతని తండ్రి కోరగా మంత్రి సానుకాలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పులి దాడిచేయకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం: ఇంద్రకరణ్‌రెడ్డి