రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కి చెందిన కూలీలు రవాణా సౌకర్యంలో లేకపోవడం వల్ల సైకిళ్ల మీద స్వస్థలానికి బయలుదేరారు. ఉదయం 6 గంటలకు బయలుదేరిన వీరు మధ్యాహ్ననికి కాగజ్‌నగర్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ బాబు వారికి భోజన సదుపాయం కల్పించారు. తమ సొంతూరుకు చేరుకోవాలంటే నాలుగు రోజులు పడుతుందని కూలీలు తెలిపారు.
ఇవీ చూడండి: ఆకలితో ఎవరూ ఉండకూడదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్