మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నాగబిడ్ తాలూకాలోని దేవసాయిల్ గ్రామానికి సమీపంలో ఆటవీప్రాంతం ఉంటుంది. అటవీ నుంచి గ్రామంలోకి చొరబడిన చిరుత పశువులపై దాడి చేసింది. అప్రమత్తమైన గ్రామస్థులు చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో స్వప్నిల్ ముసార్కార్ అనే వ్యక్తిని చిరుత గాయపరిచింది. చిరుత గ్రామం లోపలికి వెళ్లడం వల్ల స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా... చిరుతను బోనులో బంధించి జిల్లా కేంద్రానికి తరలించారు. చిరుత గ్రామంలోకి ప్రవేశించి ఒకరిని గాయపర్చడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి.. విద్యుత్ శాఖ శ్రీకారం