ETV Bharat / state

'ఎన్నికల విధుల్లో తటస్థంగా పని చేయాలి' - కుమురం భీం ఎస్పీ

ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కుమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఎన్నికల్లో పాల్గొనే రక్షణ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఎస్పీ
author img

By

Published : Apr 9, 2019, 11:54 PM IST

ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు పోటీ చేసే ఏ అభ్యర్థికీ అనుకూలంగా పని చేయకుండా తటస్థంగా ఉండాలని కుమురం భీం ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. కాగజ్​నగర్​లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో విధులు నిర్వహించే రక్షణ బలగాలతో సమావేశమయ్యారు. పోలింగ్​ కేంద్రాల వద్ద సమస్య తలెత్తితే మొబైల్​ పార్టీకి సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలింగ్​ కేంద్రంలోకి అభ్యర్థి అంగరక్షకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల టెంట్లను 200 మీటర్ల దూరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ

ఇదీ చదవండి : ఎన్నికల ఏర్పాట్లపై రజత్​కుమార్​తో ముఖాముఖి

Intro:filename:

tg_adb_31_09_ennikala_sibbandi_sp_samavesham_avb_c11

Body:లోక్ లోభ ఎన్నికల్లో ప్రజలందరూ స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు కేంద్ర బలగాలు రక్షణ కల్పించాలని తెలిపారు కుమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి.

కాగజ్ నగర్ పట్టణం జవహర్ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో
లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీసులు రక్షణ బలగాలతో సమావేశమయ్యారు కుమురం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో పాల్గొనబోయే పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలవద్ద ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే మొబైల్ పార్టీకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు పోటీ చేసే ఏ అభ్యర్థికి అనుకూలంగా పనిచేయకుండ తటస్తంగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థి అంగ రక్షకులను అనుమతించారదని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి చారవాణులను అనుమతించారదని.. రాజకీయ పార్టీల టెంట్లను కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండేలా చూడాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కుమురం భీం జిల్లా అడిషనల్ ఎస్పీ గోద్రు, కాగజ్ నగర్ డిఎస్పీ సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

బైట్: కుమురం భీం జిల్లా ఎస్పీ: మల్లారెడ్డి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.