ETV Bharat / state

మానవత్వం చాటుకున్న జడ్పీటీసీ... గర్భిణి వలసకూలీకి సాయం - అసిఫాబాద్​ జిల్లా వాంకిడి జడ్పీటీసీ అజయ్​ కుమార్

అసిఫాబాద్​ జిల్లా వాంకిడి జడ్పీటీసీ అజయ్​ కుమార్​ ఓ గర్భిణి వలసకూలికి సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వలస కూలీలలో ఓ గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రాగా సమయానికి స్పందించి.. వైద్య సాయం అందించారు.

kumuram-bhim-asifabad-district-wankidi-zptc-ajay-kumar-help-to-migrants
మానవత్వం చాటుకున్న జడ్పీటీసీ... గర్భిణి వలసకూలీకి సాయం
author img

By

Published : May 15, 2020, 5:59 PM IST

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లా వాంకిడి జడ్పీటీసీ అజయ్​ కుమార్​ తన మానవత్వం చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన కొంతమంది వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు లారీ మీద వెళ్తున్న సందర్భంలో వలస కూలీలలో ఓ గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే తన భర్త లారీ ఆపేసి... తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని స్థానికులకు చెప్పాడు. ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోని పక్షంలో అటువైపుగా వైపుగా వెళ్తున్న ఒక రిపోర్టర్​ స్పందించి వెంటనే జడ్పీటీసీకి సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన జడ్పీటీసీ అజయ్​కుమార్​... అంబులెన్స్​ను పంపించారు. వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆమెకు ఏ సమస్య రాకుండా చూసుకోవాలని సూచించారు. తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనివ్వడంతో భర్త ఆనందం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ చేసిన సాయానికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.