ETV Bharat / state

బడుగు జీవుల... బతుకు పయనం... ఓయూ కో కన్వీనర్​ దాతృత్వం

లాక్​డౌన్​ కారణంగా వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వలసకూలీలు కుమురంభీం ఆసిఫాబాద్​ మీదుగా కాలినడక వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా వారి కష్టాలకు తెలుసుకున్న ఓయూ ఐకాస కో కన్వీనర్​ అనిల్​ కుమార్​ వారికి ఆశ్రయం కల్పించారు.

author img

By

Published : Apr 16, 2020, 12:33 PM IST

kumuram bheem asifabad police stopped migrants in asifabad and ou co convener anil kumar gave accommodation to them
బడుగు జీవుల... బతుకు పయనం... ఓయూ కో కన్వీనర్​ దాతృత్వం

వరంగల్​లో నిర్మాణ పనుల కోసం రెండు మాసాల కిందట మధ్యప్రదేశ్ రాష్ట్రం సాలాఘాట్ నుంచి వచ్చిన వలస కూలీలు కుమురంభీం ఆసిఫాబాద్​ మీదుగా కాలినడకన తిరుగు పయనమయ్యారు. ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ దాటగానే స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న ఓయూ ఐకాస కో కన్వీనర్ అనిల్ కుమార్ వారికి భోజనం పెట్టించి.. స్థానిక గురుకులంలో ఆశ్రయం కల్పించారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు.

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని అనార్​పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం చిన్న పాపతో సహా హైదరాబాద్​ నుంచి కాలినడక తమ సొంత ఇంటికి వచ్చారు. కానీ వారిని గ్రామస్థులు రానివ్వకపోవడం వల్ల తిరిగి హైదరాబాద్​ కాలినడకన పయనమవుతుండగా పోలీసులు వారిని అడ్డుకుని ఆశ్రయం కల్పించారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.