కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులను పోలీసులు ఆపి... జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలను జప్తు చేస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఐ ఆకుల అశోక్ సూచించారు. అనవసరంగా బయటకు వచ్చి కరోనా మహమ్మారికి బలికావొద్దన్నారు. మాస్కు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను కట్టడి చేయొచ్చని తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు