ETV Bharat / state

VACCINE CENTERS: వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్ - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సూపర్ స్ప్రేడర్​లకు టీకాలు పంపిణీ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. టీకా పంపిణీలో ఏర్పడ్డ సమస్యలను గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

kumuram bheem asifabad collector rahul raj visited vaccine centers
వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
author img

By

Published : May 28, 2021, 7:29 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్​లోని వ్యాక్సిన్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీకాలు ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు డివిజన్ పరిధిలోని ఆయా మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు సూపర్ స్ప్రేడర్​లకు టీకాలు పంపిణీ చేశారు.

అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు తప్ప అంతటా టీకాల పంపిణీ ప్రశాంతంగానే కొనసాగింది. పాలనాధికారి రాహుల్ రాజ్ కొవిడ్ టీకా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. లబ్ధిదారుల వివరాలు, టీకా పంపిణీలో ఏర్పడ్డ సమస్యలు తెలుసుకున్నారు. టీకా కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.