ETV Bharat / state

తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు - kumaram bheem news

పేదోళ్ల జీవిత కల... పక్కా ఇల్లు కట్టుకోవడం. కాస్తంత నీడకోసం తమ గోడును ఎన్నో ఏళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా వారి కష్టాలకు పరిష్కారం దొరకలేదు. నేతల హామీలు అమలుకు నోచుకోక.. ఏళ్లతరబడి డబుల్​బెడ్​రూం ఇళ్లకోసం ఎదురు చూస్తున్నారు కుమురంభీం జిల్లా జోడేఘాట్​ వాసులు.

తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు

author img

By

Published : Sep 30, 2020, 11:20 AM IST

కుమురం భీం జిల్లా జోడేఘాట్​లో 50 డబుల్​ బెడ్​రూం ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ చెప్పి ఆరేళ్లు పైనే అయిందని స్థానికులు వాపోతున్నారు. తరతరాలుగా సరైన వసతి లేక మట్టింటిలోనే జీవనం నెట్టుకొస్తున్న తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని వేడుకుంటున్నారు.

మా ఊర్లో అందరికీ డబుల్ బెడ్​రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం సారు చెప్పిండు. ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాది పడలేదు. అందరం గూన పెంకుల ఇండ్లు, గుడిసెల్లో ఉంటున్నాం. వానొచ్చినప్పుడు దారలు కురుస్తున్నాయి. నీటికి తడిచిన గోడలు కూలతున్నాయి. మట్టితో కట్టిన ఇల్లు.. గట్టి వాన పడితే కూలిపోతాయని బుగులు ఐతంది.

సోంబాయి-కొమురం భీం మనమరాలు

ఇల్లు కాదు కదా... పునాది కూడా పడలేదు

జల్, జంగల్, జమీన్ కోసం నిజాం సేవ సేనలపై తిరగబడ్డ వీరుడు కొమురం భీం.. పోరుగడ్డ జోడేఘాట్​లో 50 కుటుంబాలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు కట్టిస్తామని 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్​, 2016లో మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. కానీ నేటికి ఇల్లు కాదుకదా.. పునాది కూడా పడలేదు. సాక్షాత్తు కుమరంభీం మనుమరాలుతో సహా 50 కుటుంబాలు మట్టిళ్లలోనే జీవనం నెట్టుకొస్తున్నారు.

జోడేఘాట్ పరిసర గ్రామాలైన కొలాంగూడ, పాట్నాపూర్, పెద్ద పాట్నాపూర్, శివ గూడా, బాబేఝరి, మహారాజ్ గూడా, పాట గూడా, చాల్బాడీ, టోకెన్ మొవాడ్, లైన్ పటర్, పిట్ట గూడ తదితర గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు, విద్య, వైద్యం లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఏటా కుమురం భీం వర్ధంతి సందర్భంగా నేతల హామీలు.. అవి నెరవేరుతాయని మాఎదురు చూపులు.. ఏళ్లుగా అందని ద్రాక్షగానే ఉంటున్నాయి.

-గ్రామస్థుడు

అసంపూర్తిగా నిలిచిన రోడ్డు నిర్మాణం

ఈ ప్రాంతంలో ప్రధాన రహదారైన హట్టి- జోడేఘాట్ రోడ్డు.. టోకెన్ మోవాడ్ వద్ద అసంపూర్తిగా ఉండిపోయింది. రహదారిలేక ఆదివాసి ప్రజల కష్టాలు వర్ణాతీతం.. వర్షం వచ్చిందంటే అడుగు పడని పరిస్థితి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి హామీల అమలుకు కార్యరూపం ఇచ్చి తమ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు జోడేఘాట్​ వాసులు.

ఇదీ చూడండి: ఖైదీల విడుదలకు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.