ఆదిలాబాద్, కుమురంభీం జిల్లా పాలనాధికారి రాహుల్‌రాజ్‌కు కరోనా సోకింది. ఆదిలాబాద్ పాలనాధికారిగా పనిచేసిన సిక్తా పట్నాయక్ ఈనెల 7 నుంచి సెలవుపై వెళ్లగా... ఆమె స్థానంలో అదే రోజు ఎఫ్‌ఏసీగా రాహుల్‌రాజ్ బాధ్యతలు చేపట్టారు. కరోనా బారిన పడిన రాహుల్‌రాజ్... ప్రస్తుతం ఆసిఫాబాద్‌లోని అధికారిక నివాసంలోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కొవిడ్ నుంచి కోలుకుని త్వరలోనే విధుల్లో చేరుతానని రాహుల్‌రాజ్ తెలిపారు.
సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున... ఆదిలాబాద్, కుమురంభీం జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. జ్వరం, ఒళ్లునొప్పులుంటే నిర్లక్ష్యం చేయకుండా... సమీప ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కరోనా పరీక్షలు చేసుకోవాలన్నారు. 45 ఏళ్ల వయస్సు పైబడిన వారు తప్పనిసరిగా కరోనా టీకాలు తీసుకోవాలని సూచించారు.