ETV Bharat / state

తిర్యానిలో జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్​..? - zptc

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాని మండలంలో కాంగ్రెస్​ జడ్పీటీసీ అభ్యర్థి అదృశ్యం కలకలం సృష్టించింది.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కిడ్నాప్​ కలకలం
author img

By

Published : May 2, 2019, 10:29 PM IST

తిర్యాని మండలంలో కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి ఒకరు కిడ్నాప్​కు గురైనట్టు కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జగన్నాథరావు కనిపించకుండా పోయారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండో విడతలో జరగనున్నప్రాదేశిక ఎన్నికల్లో తిర్యాని మండల జడ్పీటీసీ సభ్యురాలిగా తెరాస తరఫున మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్​ అభ్యర్థిగా సిడాం జగన్నాథరావుతోపాటు 12 మంది నామినేషన్​ వేశారు. గురువారం మధ్యాహ్నం వరకూ 9 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇందులో కోవా లక్ష్మి కూడా ఉన్నారు. అదే పార్టీ నుంచి చందు బరిలో నిలిచారు. ప్రస్తుతం ముగ్గురు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్​ నాయకులు తన బర్తను కిడ్నాప్​ చేశారని జగన్నాథరావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిని ఎందుకు కిడ్నాప్​ చేస్తామని కాంగ్రెస్​ వారి ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చూడండి: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన ఘనుడు

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో తిర్యాని మండలంలో కాంగ్రెస్ జెడ్పిటిసి అభ్యర్థి ఒకరు కిడ్నాప్ కు గురి అయ్యారని కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది

రెండవ విడత లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో తిర్యాని మండలం జెడ్పిటిసి సభ్యులుగా అధికార తెరాస తరఫున జెడ్పి చైర్ పర్సన్ అభ్యర్థిగా కోవా లక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా సిడాం జగన్నాథరావు సహా మొత్తం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు కాగా గురువారము మధ్యాహ్నం రెండు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉండడంతో తొమ్మిది మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ఇందులో ఇందులో ఉపసంహరించుకున్న వారితో తెరాస అభ్యర్థి జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మీ కూడా ఉన్నారు అయితే ఆ పార్టీ తరఫున చందు అనే వ్యక్తిని బరిలోకి దించారు మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జగన్నాథరావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జగన్నాథరావు ను కొంతమంది కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ జగన్నాథ రావు భార్య సిడాం రాంబాయి తిర్యాని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై తిర్యాని మండల కాంగ్రెస్ నాయకులు బొల్లం వెంకన్న నా మరికొందరిపై తిర్యాని పోలీసులు కేసు నమోదు కావడం ప్రాధాన్యత అంశంగా మారింది ఇదంతా తెరాస నాయకులు ఆడుతున్న నాటకమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపిన నాయకున్ని తామెందుకు కిడ్నాప్ చేస్తామంటూ ప్రశ్నించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కిరాల vishwa ప్రసాదరావు

తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారు

తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని కొక్కిరాల vishwa ప్రసాదరావు పేర్కొన్నారు జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోవా లక్ష్మి తాను ఓడిపోతానని ఉద్దేశంతో తిర్యాని నీ జెడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకున్నారని ఆరోపించారు తనకు ఎవరు పోటీలో నిలవ కూడదు అని ఆలోచనతోనే కోవా లక్ష్మీ మీ బరిలో నిలిచిన అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ కిడ్నాప్ కు గురి కాలేదని కొట్టిపారేశారు

Body:tg_adb_26_02_kidnap_kalakalam_av_c10

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.