కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డీఎస్పీ, రూరల్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. అటవీశాఖ అధికారులపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంటకేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగజ్‌నగర్ మండలం కొత్త సారసాల శివారులో 20 హెక్టార్ల భూమి విషయమై కొంతకాలంగా అటవీశాఖకు... స్థానిక రైతుల మధ్య వివాదం సాగుతోంది. ఈ భూముల్లో.. మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఆర్ఓ అనిత నేతృత్వంలో సిబ్బంది భూమి చదును చేసేందుకు ట్రాక్టర్లతో అక్కడి వెళ్లారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడైన జడ్పీటీసీ కోనేరు కృష్ణారావుతోపాటు అతని అనుచరులు అటవీ అధికారులపై దాడికి దిగారు. అక్కడ పోలీసులున్నా ఏం చేయాలేకపోయారనే ఆరోపణలు రావడం వల్ల కాగజ్‌నగర్ డీఎస్పీ, రూరల్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇవీ చూడండి: మాజీ సర్పంచ్‌తో చరవాణిలో ముచ్చటించిన కేసీఆర్