ETV Bharat / state

పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాప్రతినిధులు - corona in kagaznagar

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు పలువురు ప్రజా ప్రతినిధులు ముందుకొస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ చేయూతనిస్తున్నారు.

kagaznagar councilor distributed groceries to poor people
పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాప్రతినిధులు
author img

By

Published : Apr 20, 2020, 2:27 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. దీనివల్ల రోజూకూలీ పని చేసుకుని బతికే పేదప్రజలు తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకొస్తున్నారు.

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ వనమాల విజయారాము తన మిత్ర బృందం సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు తన వార్డులోని పేద ప్రజలతో పాటు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో ఈ సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.