ETV Bharat / state

కల్వర్టు కూలింది.. దవాఖానకు దారెట్ల? - కాగజ్​ నగర్​ వార్తలు

నిత్యం  వందలాది మంది వైద్య సేవల కోసం వచ్చే సర్కారు దవాఖాన అది. కానీ.. అందులోకి రావడానికి మురుగు కాలువ అడ్డమైంది. దాన్ని దాటడానికి వేసిన కల్వర్టు కూడా కూలిపోయింది. అంబులెన్సు, అమ్మఒడి వాహనాలు ఆస్పత్రిలోకి రావడానికి అవస్థలు తప్పట్లేదు.

kagaz nagar hospital way situation in rainy season
కల్వర్టు కూలింది.. దవాఖానకు.. దారెట్ల?
author img

By

Published : Jul 16, 2020, 8:41 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​ నగర్​ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం వైద్య సేవల కోసం వందలాది మంది వస్తుంటారు. వికలాంగులు, గర్భిణీలు, వృద్ధులు ఇలా ఎంతోమంది ఆస్పత్రికి వస్తారు. అయితే.. ఆస్పత్రిలోకి ప్రవేశించే మార్గంలో మురుగు కాల్వ మీద కట్టిన కల్వర్టు కూలిపోయింది. వేరే మార్గం లేక.. అంబులెన్సు, అమ్మఒడి వాహనాలు ఆ బురదలోంచే వస్తున్నాయి.

వృద్ధులు, వికలాంగులు ఆస్పత్రిలోకి ప్రవేశించే మార్గం చెడిపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క నుంచి దారి ఏర్పాటు చేసుకున్నా.. వరుస వర్షాలతో.. ఆ దారి కూడా బురదమయం అయింది. అధికారులు స్పందించి ఆ మార్గం మరమ్మత్తులు చేయిస్తే.. ఎంతోమందికి మేలు చేసినవాళ్లవుతారని స్థానిక ప్రజలు, రోగులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.