ETV Bharat / state

పడకేసిన ఏజెన్సీ దవాఖానాలు - hospitals

కుమురం భీం ఆసిఫాబాద్​ ఏజెన్సీ జిల్లాల్లో సర్కారు వైద్య సేవలు అంపశయ్యపై ఉన్నాయి. ప్రాథమిక వైద్యం ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం నెలకొల్పిన దవాఖానాలు రోగులు లేక వెలవెలబోతున్నతీరు.. వైద్యసేవలకు దర్పణం పడుతోంది. జేబులో కాసులుంటే కార్పొరేట్​ ఆస్పత్రి తలుపుతట్టడం.. లేదంటే ప్రాణాలపై ఆశలు వదిలేసి దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పడకేసిన ఏజెన్సీ దవాఖానాలు
author img

By

Published : Jul 20, 2019, 10:53 AM IST

పడకేసిన ఏజెన్సీ దవాఖానాలు

ఏజెన్సీ దవాఖానాలకు సుస్తి చేసింది

కుమురం భీం ఆసిఫాబాద్​ ఏజెన్సీల్లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నెలకొల్పిన సర్కారు ఆస్పత్రులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్​ టీ మండలాల ప్రజలకు వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఏఎన్​ఎంలే వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవాలి.

వైద్యులే లేరు
14 మంది వైద్యులుండాల్సిన ఈ ఆస్పత్రిలో సూపరింటెండెంట్​ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అతను కూడా నిత్యం కాగజ్​నగర్​ నుంచి వచ్చిపోతుంటాడు. వైద్యాధికారుల నియామకంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న తీరుతో దవాఖానాలు నిరుపయోగంగా మారాయి. కాసులుంటే కార్పొరేట్​ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడం, లేదంటే దేవుడిపై భారం వేసి బతుకుతున్నారు స్థానికులు.

పెద్దాసుపత్రులకు పంపడమే పని

నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి ఇదే అవడం వల్ల నిత్యం వందలాది మంది వస్తుంటారు. వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు, ఏఎన్​ఎంలు వైద్య పరీక్షలు చేసి ఇతర పట్టణాల్లో ఆస్పత్రులకు రిఫర్​ చేస్తున్నారు. చేసేదేమీ లేక ప్రజలు కాగజ్​నగర్​కు, మంచిర్యాలకు వెళ్తున్నారు.

అవసరాలను సొమ్ముచేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు
అమాయక ప్రజల అవసరాలను కార్పొరేట్​ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అందినకాడికి దోచుకుని జేబులు గుళ్ల చేస్తున్నాయి. చిన్న చిన్న జబ్బులకు కూడా వేలకు వేలు బిల్లులు వేసి ముక్కుపిండి వసూలుచేస్తున్నాయి. జబ్బు కంటే డాక్టరు బిల్లుకే ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

నియోజకవర్గాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పుకొస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వైద్యంపై శీతకన్ను వేశారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: మోదీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు

సికింద్రాబాద్ యాంకర్ ..మూడు ఏళ్ల ప్రాయంలోనే 30 ఏళ్ల అనుభవం ..మీరు ఏ రాష్ట్రం పేరైనా అడగండి దాని రాజధాని అంటే చెప్పేస్తాడు,తనకున్న చిన్నపాటి మేధస్సును ఉపయోగించి పెద్ద విజయాలు సాధించేందుకు చిన్ననాటి ప్రాయం నుండే బాటలు వేసుకుంటున్నాడు..అతని తండ్రిని ఆదర్శంగా తీసుకుంటూ తండ్రి సాధించిన రికార్డులకు తానేమీ తక్కువ కాదన్నట్లు పసిప్రాయం నుండే రికార్డుల వేట లో పడ్డాడు.చదువుతోపాటు రోజు ఒక గంట సేపు మెమోరీ ట్రైనింగ్ సంస్థలో అతను శిక్షణ పొందుతున్నాడు .అతని విజయానికి బాసటగా గణిత మాస్టారు అయినా అతని తండ్రి నారాయణ, ఇంట్లో శిక్షణ ఇచ్చే అతని తల్లి ప్రియాంక ,దేవాన్ష్ కు శిక్షణ అందిస్తున్న ఇంప్రూవ్ సంస్థ కృషి అతన్ని ఉన్నత శిఖరానికి చేరవేసేందుకు మార్గాన్ని సుగమం చేసింది..మూడేళ్ల వయసులోనే ముద్దులొలికే మాటలతో మనసును ఆహ్లాదపరిచే దేవాన్ష్ ప్రతిభను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు .తనకున్న జ్ఞాపకశక్తితో తక్కువ సమయంలోనే రాష్ట్రాల దేశాలు రాజధానుల ఎక్కువ పేర్లు చెప్పి రికార్డు సృష్టించాడు..తెలంగాణ బుక్స్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ రికార్డు పుస్తకం,సూపర్ కిడ్స్ రికార్డు పుస్తకాలలో తనదైన స్థానాన్ని సాధించి ముద్రవేసుకున్నాడు ఈ మూడేళ్ల బుడతడు..ఆ బుడతడి పేరు శ్రీ సాయి దేవాన్ష్ ..బోయిన్పల్లిలోని బైసన్ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్లో నర్సరీ చదువుతున్న దేవాన్ష్ తక్కువ కాల వ్యవధిలో 113 అంశాలకు సమాధానం చెప్తాడు..35 దేశాల పేర్లు 25 దేశాల జాతీయ పతాకాలు,మన దేశ రాష్ట్ర రాజధానుల పేర్లు చారిత్రక కట్టడాల పేర్లు అలవోకగా చెప్పేస్తున్నాడు ..అతని ప్రతిభను గుర్తించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ,సూపర్ కిడ్స్ రికార్డ్స్ పుస్తకాల్లో పతకాలు సాధించాడు..ఈ సందర్భంగా తండ్రి జేపీ నారాయణ్ మాట్లాడుతూ తాను కూడా గణిత శాస్త్ర విభాగంలో అనేక రికార్డులు సాధించానని తెలిపారు ..ప్రస్తుతం పంజాగుట్టలోని పాఠశాలలో గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు..తన కొడుకు కూడా తనలాగే రికార్డులు సాధించడం చిన్ననాటి నుండే తన జ్ఞాపకశక్తిని మెరుగులు దిద్దడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు..ఇప్పటి వరకు తమ కుమారుడు దేవాన్ష్ రికార్డులు నెలకొల్పాడ0 తమకెంతో సంతృప్తినిచ్చాయని స్పష్టం చేశారు ..భవిష్యత్తులో తన కుమారుడిని ఒక వైద్యుడిగా చూడాలనేది తమ కోరిక అని ఆయన అన్నారు..తన కుమారుడు ఈ విజయం వెనకాల తల్లి కృషి తోపాటు మెమొరీ ట్రైనర్స్ శ్రమ ఎంతో ఉందని కొనియాడారు.. ఈ సందర్భంగా ఇంప్రూవ్ సంస్థ మెమోరీ ట్రైనర్ కరుణ్ మాట్లాడుతూ మెమొరీ ట్రైనింగ్ సంస్థ ద్వారా తాము అనేక మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.మొట్టమొదటగా తమ కొడుకు పైనే జ్ఞాపకశక్తి శిక్షణ ఇచ్చి సఫలీకృతం అయ్యామని అన్నారు .పిల్లలకు సరికొత్త కోడింగ్ విధానాల ద్వారా జనరల్ నాలెడ్జ్ ను నేర్పిస్తున్న మని స్పష్టం చేశారు..మెమొరీ ట్రైనింగ్ పట్ల చాలా మంది తల్లిదండ్రులకు సరైన అవగాహన లేదన్నారు..తాము పిల్లల్ని ఓపికతో వారి మార్గంలోనే వెళ్లి వారికి నచ్చచెబుతూ నేర్పిస్తామని అన్నారు ..ఇప్పటి వరకు అనేక అవార్డులు సాధించామని ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ ప్రభుత్వం తమ లాంటి వారికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ..పిల్లల్లో మేధోశక్తిని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు..ఈ సందర్భంగా మెమొరీ ట్రైనర్ అనిత మాట్లాడుతూ కరణ్ తాను ఇద్దరు భార్యాభర్తలు మని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి రెండు సంవత్సరాల క్రితం బోయిన్ పల్లి లో ఇంప్రూవ్ అనే మెమరీ ట్రైనింగ్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు ..పిల్లలకు మెమొరీ ట్రైనింగ్ ఇవ్వడం తమకు ఎంతో సంతృప్తి ఇస్తుందని తెలిపారు ..14 నెలల పిల్లలు నుండి 7 సంవత్సరాల చిన్నారులకు తాము మెమరీ ట్రైనింగ్ ఇస్తామని అన్నారు..వాళ్లు డ్రైవింగ్ అయిన అనంతరం వారిచే ఈవెంట్లలో వారి ప్రతిభను నిరూపించేలా చేస్తామని అన్నారు..పిల్లలకు పిక్ టోగ్రఫీ విధానం ద్వారా శిక్షణ ఇస్తామని వెల్లడించారు..రోజుకు కేవలం ఒక గంట సేపు మాత్రమే ఈ ట్రైనింగ్ ఉంటుందని అన్నారు..పిల్లలలో చదువు పట్ల జ్ఞాపకశక్తి పట్ల జనరల్ నాలెడ్జ్ పెంపొందించడమే ఇంప్రూవ్ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు...1..నారాయణ్ దేవాన్ష్ తండ్రి 2..కరుణ్ ఇంప్రూవ్ సంస్థ వ్యవస్థాపకుడు 2.అనిత ..కరణ్ భార్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.