ETV Bharat / state

విద్యార్థినికి 20నిమిషాలు ఆలస్యం.. బతిమాలినా అనుమతికి 'నో.!' - INTER EXAMS 2020

నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా ఓ విద్యార్థిని పరీక్షకు దూరమైంది. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో పరీక్షా కేంద్రానికి 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినిని అధికారులు అనుమతించలేదు.

INTER STUDENT 20 MINUTES LATE TO EXAM CENTER

author img

By

Published : Mar 4, 2020, 11:31 AM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో ఓ విద్యార్థిని ఆలస్యం కారణంగా పరీక్షకు దూరమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బాలభారతి పరీక్ష కేంద్రానికి 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా... కేంద్రంలోకి అనుమతించకూడదన్న నిబంధన దృష్ట్యా... గేట్లు మూసేశారు.

అనివార్య కారణాల వల్ల కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని పోలీసులను అనుమతించాలని వేడుకుంది. తమకున్న ఉత్తర్వులకనుగుణంగా అనుమతించటం కుదరదని స్పష్టం చేయగా... కన్నీళ్లు పెట్టుకోవటం విద్యార్థి వంతైంది. చేసేదేమీ లేక విషాద వదనాలతో ఇంటికి తిరుగుముఖం పట్టింది.

20 నిమిషాలు ఆలస్యం... పరీక్షకు దూరమైన విద్యార్థిని

ఇవీ చూడండి: నేటి నుంచి ఇంటర్​ పరీక్షలు.. హాజరవనున్న 9 లక్షలకుపైగా విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.