ETV Bharat / state

హరితహారం లక్ష్యానికి.. మొక్కల కొరత! - అసిఫాబాద్​

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపాలిటీలో గత అయిదు విడతల హరితహారాల్లో లక్షలోపు మొక్కలు నాటడమే లక్ష్యంగా విధించారు. ఈ ఏడాది ఆరో విడతలో ఏకంగా 3 లక్షల 74వేల 300 మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. మొక్కల కొరత వల్ల లక్ష్యం చేరుకుంటామా లేదా అని అధికారుల్లో కలవరం మొదలైంది. ఇప్పటి వరకు 25 శాతం మొక్కలు కూడా నాటలేదు.

Haritha Haram Target Not Reached in Kagaz nagar Municipality Due to palnts shortage
హరితహారం లక్ష్యానికి.. మొక్కల కొరత!
author img

By

Published : Jul 28, 2020, 12:23 PM IST

కాగజ్​నగర్​ పురపాలిక అధికారులు జులై 1న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా వందల సంఖ్యలో మాత్రమే మొక్కలు నాటారు. శ్మశానవాటికలు, ఈఎస్ఐ రిజర్వాయర్ ఏరియా, పిల్లల ఉద్యావనం, మసీదు, దేవాలయాల్లోని ఖాళీ స్థలాల్లో దాదాపు 40 నుంచి 50 వేల మొక్కలు నాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం పురపాలికకు కేవలం ఒకే ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ మండల పరిధిలోని వంజీరి సమీపంలోని రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం బల్దియా నర్సరీల కోసం కేటాయించింది. ఆ భూమిని సరిగ్గా వినియోగించుకోక.. నిరుపయోగంగా మార్చారు.

అటవీ శాఖ, ఇతర శాఖల నుంచి నుంచి పురపాలిక అధికారులు దాదాపు 50 వేల మొక్కలను తీసుకొచ్చినట్లు తెలిసింది. పచ్చదనం పెంపు కోసం పురపాలిక బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించడం వల్ల కొనుగోలు ప్రక్రియ సులువవుతుందని అధికా రులు భావిస్తున్నారు. స్థానిక బల్దియా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మొక్కలు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. బల్దియా, ఇతర నర్సరీల్లోనూ పూలు, పండ్ల, వివిధ రకాల మొక్కల కొరత ఉంది. పట్టణ ప్రజలు తమ ఖాళీస్థలాల్లో ఎక్కు వగా పూలు, పండ్ల మొక్కలను నాటేందుకు ఇష్టపడుతున్నారు.

ఆయా నర్సరీల్లో మొక్కల కోసం ఉత్సాహంగా పుర ప్రజలు వచ్చినా.. కొరత కారణంగా అందరికీ మొక్కలు అందించలేకపోతున్నారు. నర్సరీల్లో ఎక్కువగా నీడనిచ్చే మొక్కలు ఉండగా, వాటిని తీసుకెళ్లి ఇంటి ఆవరణల్లో నాటేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. అయిదు విడతల్లో భాగంగా గతంలో నాటిన చోటే మళ్లీ మొక్కలు నాటుతున్నారు. రక్షణ కంచెలు కూడా తక్కువగానే కొనుగోలు చేశారని అంటున్నారు. పాలకవర్గం సభ్యులు మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపుతున్నా రక్షణపై అంతగా శ్రద్ధ చూపడం లేదని విమర్శలున్నాయి. పర్యావరణ పరిరక్షణపై పట్టణవాసులకు అవగాహన కల్పించాలని, పాలకవర్గం సభ్యులు, మెప్మా, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రత్యేక చొరవ తీసుకుని నాటిన ప్రతి మొక్కకు రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తే.. ఉపయగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.