కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అంకిత భావంతో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తమ వంతు సాయం అందిస్తున్నారు దాతలు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని పారిశుద్ధ్య కార్మికులకు మర్చంట్ అసోసియేషన్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పట్టణ ఎస్ఎచ్ఓ మోహన్, ఎస్సైలు రవి కుమార్, గంగన్న చేతుల మీదుగా సరుకులు అందజేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అందుకోసం పారిశుద్ధ్య కార్మికులు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని కొనియాడారు.