కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల అతన్ని అధికారులు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ చేయడం వల్ల వారు నివాసం ఉంటున్న ప్రాంత ప్రజలెవరూ ఎవరు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లయితే ఏర్పాటు చేశారు కాని తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.
నిత్యావసర సరుకులు దొరకక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుమారుడు వంశీ.. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. వారం రోజులకు సరిపడా సరుకులు అందిస్తున్నామని ఏమైనా అవసరం పడితే తనను సంప్రదించాలని స్థానికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ