ETV Bharat / state

భారీ వర్షానికి డీఆర్​డిపోలో తడిచిన సరుకులు - డీఆర్​డిపోలో వర్షానికి తడిచిన సరుకులు

కుమురంభీం​ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని డీఆర్​డిపోలో బియ్యం, పప్పులు వర్షానికి తడిసిపోయాయి. సుమారు రూ.70 వేలు విలువైన బియ్యం, ఇతర సామగ్రి పాడైపోయాయని తహసీల్దారు మల్లికార్జున్​ తెలిపారు.

కుమురంభీం జిల్లా వార్తలు
కుమురంభీం జిల్లా వార్తలు
author img

By

Published : Jun 9, 2021, 4:51 PM IST

కుమురంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి మండల కేంద్రంలోని డీఆర్​డిపోలో రు. 70వేల విలువైన బియ్యం ఇతర వస్తువులు తడిచిపోయాయని తహసీల్దారు మల్లికార్జున్​ తెలిపారు. సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 30 కిలోల కందిపప్పు, 30 కిలోల పెసరపప్పు, 50 కిలోల పంచదార, 30 కిలోల గోధుమ పిండి, 30 కిలోల కారంపొడి, సంతూర్​ సబ్బులు తడిచిపోయాయని వెల్లడించారు.

డిపో భవనం పైకప్పు మరమ్మతుకు గురవడం సరుకులు తడిచిపోయాయని తెలిపారు. తడిచిన బియ్యాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని.. భవనానికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని డీఆర్​డిపో మేనేజర్​ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్​ఐ అశోక్​, వీఆర్వో రమేశ్​, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: చర్లపల్లి జైలులో ఖైదీల వ్యవసాయం.. 180 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.