ETV Bharat / state

గిరిజనులను ఖాళీ చేయించిన అటవీ అధికారులు

కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలో గిరిజన గూడెంను అటవీ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. నిర్ణీత గడువులోపు ఖాళీ చేయనందున అటవీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

గిరిజనులను ఖాళీ
author img

By

Published : Jun 13, 2019, 3:12 PM IST

కుమురంభీం జిల్లా అంకుశాపూర్ అటవీప్రాంతంలో నివసిస్తున్న గోండు, కోలాం కుటుంబాలను అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఏప్రిల్​లో తమకు అటవీ హక్కు కల్పించాలని గిరిజనులు న్యాయస్థానాన్ని ఆశ్రియించారు. అంతలోనే అధికారులు ఆ రెండు గూడాల్లో నివాసం ఉండేందుకు ఎటువంటి హక్కు లేదంటూ... వారంలోగా ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపారు. నెలరోజులు గడుస్తున్న వారు వెళ్లకపోవడం వల్ల అధికారులు బలవంతంగా పంపించేశారు. గుడిసెలు, రేకులషెడ్లు కూల్చివేశారు. దాదాపు 20 కుటుంబాలను వెంపల్లి కలప డిపోకు తరలించారు. రెండురోజులుగా పిల్లలతో సహా బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉన్నామని వాపోయారు. భోజనాలు, విశ్రాంతి సదుపాయం కూడా కల్పించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల ఖాళీ

Intro:filename:

tg_adb_20_13_girijana_gudanni_kali_cheyinchina_atavi_adhikarulu_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గూడాలను ఖాళీ చేయించారు అటవీ శాఖ అధికారులు.

అంకుశపూర్ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో రెండు గూడాలలో గొండిలు, కొలంలు సుమారు 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత ఎప్రిల్లో తమకు అటవీ హక్కు కలిపించాలంటూ అక్కడి గిరిజనులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంతలో అటవీ అధికారులు ఆ రెండు గుడాల్లోని గిరిజనులకు అక్కడ నివాసం ఉండేందుకు ఎటువంటి హక్కు లేదంటూ, 7రోజులలో అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ తెలిపారు. గిరిజనులు గూడాలు ఖాళీ చేయకపోవడంతో నిన్న మధ్యాహ్నం అటవీ శాఖ అధికారులు గిరిజన నివాసాలను కూల్చివేసి 15 కుటుంబాలను పిల్లా పాపలతో, తట్ట బుట్టతో సహా కాగజ్ నగర్ లోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. మళ్ళీ రాత్రికి అన్ని కుటుంబాలను వెంపల్లి లోని కలప డిపోకు తరలించారు. నిన్నటి నుండి పిల్ల పాపలతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నామని గిరిజనులు తెలిపారు. ఎన్నో ఏండ్ల నుండి అడవిలోనే నివాసం ఉంటున్న తమను ఇలా తీసుకువచ్చి పడేసారని ఆవేదన చెందారు గిరిజనులు.

బైట్:
కోవ బీమ్ (గిరిజనుడు)

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.