కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాలకు చెందిన లక్క మల్లేశ్ 3 ఎకరాల భూమిలో గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల అటవీ శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుందుకు చర్యలు చేపట్టారు. ట్రాక్టర్‌తో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించగా రైతు మల్లేశ్ అడ్డుకున్నాడు. ఈ పొలం అటవీ శాఖకు చెందిందని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మనస్థాపం చెందిన రైతు మల్లేశ్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని కుటుంబ సభ్యులు కాగజ్ నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు