ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అటవీశాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోజురోజుకు అంతరించిపోతున్న జంతు వృక్షజాతుల మీద అవగాహన పెంచడానికి ఈ ర్యాలీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వన్యప్రాణుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలని సూచించారు. ఈ ర్యాలీలో కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్, ఎఫ్ఆర్ఓ శివ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పోసానిపేటలో మాజీ నక్సలైట్ కాల్పుల కలకలం