కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 14 వ అఖిల భారత గోండ్వానా గోండ్ మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కుమురం భీం భవన్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు పాల్గొన్నారు.ఆదివాసీలను అడవికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోయం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో లక్షమందిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివచ్చారు.
ఇవీచదవండి: నిన్న 300... నేడు 200