ETV Bharat / state

విద్యార్థుల అస్వస్థత... సిబ్బందిపై వేటు - 6 STUDENNTS

నిన్న 36, నేడు ఆరుగురు విద్యార్థినులు కలుషిత ఆహారం, నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వ్యవహారంలో ఈటీవీ భారత్ కథనాలపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నిర్థరించి.. ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్​ను​ సస్పెండ్ చేశారు.

విద్యార్థుల అస్వస్థత... అధికారుల సస్పెండ్...
author img

By

Published : Mar 19, 2019, 4:24 PM IST

విద్యార్థుల అస్వస్థత... అధికారుల సస్పెండ్...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని, వార్డెన్​నుసస్పెండ్ చేశారు. పాఠశాలలో కలుషిత నీరు తాగి సోమవారం 36, మంగళవారం ఆరుగురు కలిపి మొత్తం 42 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి వద్దకుఒక్క అధికారి రాలేదు.

చిన్నారుల పట్ల ఇంత నిర్లక్ష్యమా..?

ఇంత జరిగినా నిర్లక్ష్యంగా ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్​ తీరుపై విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఈటీవీ భారత్ సాయంతో ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్​పై వేటు

ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం.. పిల్లల అనారోగ్యానికి కారణమైన ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ శాంతను సస్పెండ్ చేస్తూ జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి దిలీప్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:ఆన్​లైన్​లో ఓటర్ల సమాచారం తొలగించడం కష్టమే..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.