ETV Bharat / state

అన్నల కోసం వేట.. 500 మంది పోలీసులతో కూంబింగ్

author img

By

Published : Jul 17, 2020, 7:56 PM IST

డీజీపీ మహేందర్ రెడ్డి త్వరలోనే మావోయిస్టులను పట్టుకుంటామని ప్రకటించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ స్వయంగా ఆసిఫాబాద్​కు వచ్చి సమీక్ష నిర్వహించారు. తిర్యాని అటవీ ప్రాంతంలో 500 మంది పోలీస్ బలగాలతో కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోపక్క ఆదివాసి పల్లెల్లో పోలీసులు, మావోయిస్టుల కదలికలతో భయాందోళనకు గురవుతున్నారు.

five hundred people Police combing in Asifabad forest
ఆసిఫాబాద్ అడవుల్లో 500 మంది పోలీసుల కూంబింగ్

డీజీపీ మహేందర్ రెడ్డి త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆయన పర్యటించారు. ఆసిఫాబాద్‌లో వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి, రామగుండం సీపీ సత్యానారాయణ, జిల్లా ఇంఛార్జి ఎస్​పీ విష్ణు వారియర్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై చర్చించారు.

తిర్యాని అటవీ ప్రాంతంలో 500 మంది పోలీస్ బలగాలతో కూంబింగ్ మరింత ముమ్మరం చేశారు. ఈనెల 14న తిర్యాని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగగా... పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈనెల 15న తిర్యాని మండలం తొక్కిగూడలో ఆదివాసి పల్లెల్లో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన పటేల్ అనంతరావు, శ్రీనివాసులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రిందట అనంతరావును నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కోర్టుకు రిమాండ్ చేయగా మిగతా వారిని వదిలి పెట్టారు. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని పల్లెల్లో ఆదివాసీలు భయాందోళన చెందుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇదీ చూడండి : కేంద్ర పంచాయతీ నిధులు.. రైతు వేదికలకు కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.