కుమురం భీం ఆసిఫాబాద్‌లో హత్యాచారానికి గురైన సమత కేసులో దర్యాప్తును పోలీసులు వేగం పెంచారు. 44 మంది సాక్షులతో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో సమత అత్యాచార, హత్య కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇందులో రోజుకు ఐదుగురిని చొప్పున విచారించే అవకాశం ఉన్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన