కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలు నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. తీవ్రగాయాలతో ఒకరు మృతి చెందారు. జిట్టవేని మల్లేశ్, కిష్టయ్యలు అన్నదమ్ములు. గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇవాళ ఉదయం మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఇద్దరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అన్న మల్లేశ్ పై తమ్ముడు కిష్టయ్య కర్రతో దాడి చేశాడు. మల్లేశ్ తలకు పెద్ద గాయమై తీవ్ర రక్త స్రావం జరిగింది. స్థానికులు మల్లేశ్‌ను కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు