కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై అబ్కారీ పోలీసులు దాడులు చేశారు. చేడ్వాయిలోని ఓ ఇంట్లో గుడుంబా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో 50 కేజీల బెల్లం, 5 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. ఈ మేరకు అజ్మెరా జ్యోతి అనే మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గుడుంబా స్థావరాలపై అబ్కారీ పోలీసుల దాడులు - LOCK DOWN EFFECTS
లాక్డౌన్ వేళ గుండుబా తయారీకి కొందరు వ్యక్తులు తెరలేపగా... వారి పనిపట్టేందుకు అబ్కారీ పోలీసులు దాడులు చేస్తున్నారు. కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై దాడులు చేసి పెద్దఎత్తున సరుకును స్వాధీనం చేసుకున్నారు.
అబ్కారీ పోలీసుల దాడులు... భారీగా గుడుంబా స్వాధీనం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై అబ్కారీ పోలీసులు దాడులు చేశారు. చేడ్వాయిలోని ఓ ఇంట్లో గుడుంబా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో 50 కేజీల బెల్లం, 5 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. ఈ మేరకు అజ్మెరా జ్యోతి అనే మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!