కుమురం భీం జిల్లా అంకుశాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు.. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల పరిరక్షణ అధికారి మహేశ్ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. సత్వరమే స్పాన్సర్షిప్ పథకం కింద ఆర్థిక సహాయం అందించి.. పిల్లల చదువులు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం పిల్లలిద్దరిని.. వారి అమ్మమ్మ వద్ద ఉంచి పర్యవేక్షిస్తున్నామని మహేశ్ తెలిపారు. వారికి నెలకు సరిపడా నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో.. సంరక్షణ అధికారి శ్రవణ్ కుమార్, అంగన్వాడి టీచర్ సుజాత పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో కరోనా రోగి మృతి- వైద్యుడిపై బంధువుల దాడి