ETV Bharat / state

ఆసిఫాబాద్​లోనే డీజీపీ.. ఎందుకెళ్లినట్టు.. ఏం చేస్తున్నట్టు? - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు

డీజీపీ మహేందర్​ రెడ్డి గత నాలుగు రోజులుగా ఆసిఫాబాద్​లోనే బస చేస్తున్నారు. డీజీపీ ఇక్కడ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

dgp mahender reddy staying in asifabad for last four days
నాలుగు రోజులుగా ఆసిఫాబాద్​లోనే డీజీపీ
author img

By

Published : Sep 5, 2020, 1:55 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో డీజీపీ మహేందర్​ రెడ్డి బస చేస్తున్నారు. ఈ నెల 2న హెలికాప్టర్​లో ఆసిఫాబాద్​కు చేరుకున్న డీజీపీ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆయన నాలుగు రోజులుగా ఇక్కడే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహేందర్​ రెడ్డి రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్​తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. శుక్రవారం రాత్రి మారుమూల అటవీ ప్రాంతమైన తిర్యాణి పోలీస్ స్టేషన్​ను సందర్శించి.. పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడానికి నిరాకరించారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.