కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో కొలువుదీరారు. అమ్మవారి ఎదుట దేవి సహస్ర సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.