ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: పురపాలికలో నిలిచిన అభివృద్ధి - కుమురంభీం జిల్లాలో నిలిచిపోయిన రోడ్డు పనులు

లాక్​డౌన్​తో కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పురపాలికలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కార్మికులు లేక ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు తెలంగాణలో లాక్​డౌన్​ విధించడం వల్ల సొంతూళ్లకు వెళ్లిపోయారు. కార్మికులు లేకపోవడం వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేమని గుత్తేదారులు చేతులెత్తేశారు.

Telangana news
నిలిచిపోయిన అభివృద్ధి పనులు
author img

By

Published : May 17, 2021, 10:04 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ ప్రభావం వల్ల నిర్మాణ రంగం కుదేలైంది. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలిక పరిధిలో లాక్​డౌన్ అమలు కంటే ముందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలతో గుత్తేదారులు పనులు చేపట్టారు. లాక్​డౌన్​ కారణంగా వారంతా ముందుగానే సొంతూళ్లకు వెళ్లిపోయారు. స్థానికంగా కార్మికులు దొరకకపోవడం వల్ల సకాలంలో పనులు పూర్తి చేయడం కష్టంగా మారిందని గుత్తేదారులు పేర్కొన్నారు.

వలస కార్మికులు స్థానికంగా ఉంటే అన్ని వసతులు గుత్తేదారులే కల్పించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గుత్తేదారులు మాత్రం ఆ నిబంధనలు తమకు పట్టవన్నట్లు అభివృద్ధి పనులు నిలిపేశారు. టీయుఎఫ్ఐడీసీ, మిషన్ భగీరథ-అర్బన్, 14వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. కాగజ్ నగర్ మండలం బోరిగాం శివారులో రెండు పడక గదుల గృహసముదాయాల నిర్మాణాలు సాగుతుండగా.. కూలీలు లేకపోవడం వల్ల పనులు మరింత జాప్యం కానున్నాయి.

14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 లక్షల వ్యయంతో సంజీవయ్య కాలనీ ప్రధాన రహదారిపై కల్వర్టు, మురుగుకాలువ నిర్మాణాలకు గత నెలలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కార్మికులు లేక పనులు నిలిచిపోయాయి. కాలువ కోసం తవ్వకాలు చేసి నిర్మాణాలు చేపట్టక పోవడం వల్ల స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్, రాజీవ్ గాంధీ చౌరస్తాలో మురుగుకాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆ పనులు ఇంకా మొదలు కాలేదు.

అధికారులేమంటున్నారు

కొవిడ్​ వ్యాప్తి, లాక్​డౌన్​ కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారని... అందువల్ల పనులు నిలిచిపోయాయని పురపాలక డీఈ గోపాల్​ పేర్కొన్నారు. కొన్ని పనులను స్థానిక కార్మికులతో పూర్తి చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: జోరుగా ఉపాధి హామీ పనులు.. ప్రతి రోజూ 50వేలకు పైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.