కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, డీఎస్పీ స్వామి పాల్గొన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 13 ద్విచక్రవాహనాలు, రూ. 6 వందల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకే ఈ తనిఖీలు చేపడుతున్నామని ఏఎస్పీ సుధీంద్ర పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులను కోరారు. సీసీ కెమెరాల వల్ల నేరాలు అదుపులో ఉంటాయన్నారు. తనిఖీల్లో కాగజ్‌నగర్ ఎస్సై రాజ్‌కుమార్, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.