రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్‌డౌన్ కారణంగా మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మద్యం కోసం ప్రజలు ఎగబడ్డారు. మద్యం ప్రియులు దుకాణాల ముందు నిలబడి కావల్సినంత మద్యం తీసుకుని నిల్వ పెట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులు పెద్దమొత్తంలో మందు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: ' ఆ సమయంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి'