కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో కరోనా కేసులు నమోదు అయినందున జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమయింది. కాగజ్ నగర్ పట్టణంలోని గంగారాం బస్తీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
నగర కమిషనర్ శ్రీనివాస్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాలను పిచికారీ చేయించారు. పురపాలక సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సద్దాం హుస్సేన్ పట్టణంలో తిరుగూతూ.. ప్రజలంతా అవసరం ఉంటేనే.. బయటకు రావాలని.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.