వానాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్ర పరుచుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రజలకు సూచించారు. రెబ్బెన మండలంలోని పాసిగామ్, లక్ష్మీపూర్ గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పంపులకు కుళాయిలు అమర్చకపోవడం వల్ల సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల పూడిక తీయించాలన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఐదు రోజులు... ఆరు హత్యలు...