ETV Bharat / state

'గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం- గిరిజనులు కానివారికీ త్వరలో పట్టాలు ఇస్తాం'

CM KCR Election Campaign at Asifabad : జల్​, జంగిల్​, జమీన్​ నినాదంతో పోరాడిన కుమురం భీం పేరును ఆసిఫాబాద్​ జిల్లాకు పెట్టుకున్నామని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ తెలిపారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. ప్రజాస్వామ్యం గెలవాలని సీఎం కేసీఆర్​ కోరారు. కుమురం భీం ఆసిఫాబాద్​లో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొని ప్రసంగించారు.

brs praja ashirvada sabha
CM KCR Election Campaign at Asifabad
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 3:54 PM IST

Updated : Nov 8, 2023, 7:17 PM IST

CM KCR Election Campaign at Asifabad : గతంలో వానాకాలం వస్తే మంచం పట్టిన మన్యం అని పత్రికల్లో వార్తలు వచ్చేవని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR)​ గుర్తు చేశారు. కానీ అలాంటి ఆసిఫాబాద్​లో ఇప్పుడు మెడికల్​ కాలేజీ, వందల పడకల ఆస్పత్రి వచ్చాయని హర్షించారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో పాల్గొన్న సీఎం కేసీఆర్​.. ప్రసంగించారు.

ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. ప్రజాస్వామ్యం గెలవాలని సీఎం కేసీఆర్​ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటే(VOTE) వజ్రాయుధమని.. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను గమనించాలని సూచించారు. బీఆర్​ఎస్​ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని.. తెలంగాణ రాబట్టే ఆసిఫాబాద్​ జిల్లా అయిందని చెప్పారు. జల్​, జంగల్​, జమీన్​ నినాదంతో పోరాడిన కుమురం భీం పేరును జిల్లాకు పెట్టుకున్నామని గుర్తు చేశారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం.. గిరిజనులు కాని వారికి కూడా త్వరలో పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్​ మాటిచ్చారు. మాలి కులస్తుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ప్రత్యేకంగా చెప్పారు. మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజాస్వామ్య పరిణితితో ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఆ ఓటే రాబోయే ఐదేళ్లు మీ మనుగడను నిర్దేశిస్తుందన్నారు.

CM KCR Election Campaign 2023 : "టాప్​గేర్​లో కేసీఆర్ ప్రచార సభలు.. కాంగ్రెస్ వస్తే ఇబ్బందులు తప్పవని మండిపాటు"

"మూడోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజాస్వామ్య పరిణితి ప్రదర్శించి ఓటు వేయాలి. ఎలక్షన్​ వస్తుంది.. పోతుంది. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర ఏంది అనేది చూడాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల వద్ద ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆ ఓటు అనేది ఐదేళ్ల మీ చరిత్రను మారుస్తుంది. అందుకే ఆలోచించి ఓటేయండి. బీఆర్​ఎస్​ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం. తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఆనాడు ఆసిఫాబాద్​ జిల్లా కాకపోదును. గతంలో వార్తాపత్రికల్లో వర్షం వచ్చిందంటే మంచం పట్టిన మన్యం అనే కథనాలు వచ్చేవి. ఈరోజు ఆసిఫాబాద్​లో మెడికల్​ కాలేజీ వస్తుందని ఎవరూ అనుకోలేదు." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

మోరాయించిన హెలికాప్టర్​.. బస్సులో ఆసిఫాబాద్​కు సీఎం కేసీఆర్​ : సిర్పూర్​ కాగజ్​నగర్​ జిల్లాలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్​ హెలికాప్టర్​పై ఆసిఫాబాద్​ సభకు బయలుదేరారు. హెలికాప్టర్​లో కూర్చున్న కేసీఆర్​.. హెలికాప్టర్​ మోరాయించడంతో దిగి బస్సులో రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్​ చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రజలు సీఎం కేసీఆర్​కు అభివాదం తెలిపారు.

గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం- గిరిజనులు కానివారికీ త్వరలో పట్టాలు ఇస్తాం

CM KCR Speech at Jukkal Praja Asheerwada Sabha : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కరెంట్‌ ఉండదు, రైతుబంధు అందదు : కేసీఆర్

CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవి : సీఎం కేసీఆర్​

Last Updated : Nov 8, 2023, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.