కొమురం భీం జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీని ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేపట్టారు. మట్టి గణనాథులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మట్టితో చేసిన విగ్రహాలు శ్రేష్టమైనవని, సహజమైన, హానికరం కాని రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి వాతావరణ సమస్యలు ప్రజలు తెలుసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడకుండా ఉండాలని కోరారు.
ఇవీచూడండి: ఇందూరులో 60అడుగుల మట్టి మహాగణపతి