కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ వాహిని, హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర యోగ ప్రచారక్ అశోక్, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రంగస్వామి, భాజపా సిర్పూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఛత్రపతి శివాజీ చూపిన మార్గంలో యువత నడుస్తూ సమాజ అభ్యున్నతికై తోడ్పడాలని వక్తలు సూచించారు.
ఇవీ చూడండి: మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి