ETV Bharat / state

కట్నం వద్దు.. ఎడ్ల బండి చాలు - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తాజా వార్తలు

పెరుగుతున్న పెట్రోల్​ ధరతో ఎలా నెట్టుకొస్తామనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి తన పెళ్లికి కట్నంగా ఎడ్ల బండి అడిగాడు. అల్లుడి కోరికకు అవాక్కైన అత్తమామలు.. చివరికి ఎడ్ల బండినే కట్నంగా ఇచ్చి కూతురి వివాహం జరిపించారు.

Bull cart as dowry in kumuram bheem asifabad district
కట్నం వద్దు.. ఎడ్ల బండి చాలు
author img

By

Published : Mar 7, 2021, 7:19 PM IST

సాధారణంగా పెళ్లంటే మొదటిగా అడిగే ప్రశ్న కట్నం ఎంత.. భూమి ఇస్తున్నారా.. డబ్బులిస్తున్నారా.. బంగారం పెడుతున్నారా.. అని అడుగుతారు. కాని ఓ పెళ్లికొడుకు మాత్రం విచిత్ర కోరిక కోరాడు. ఏ కారో, ద్విచక్ర వాహనమో అడగకుండా ఎడ్ల బండిని అడిగాడు. పెరుగుతున్న పెట్రోల్​ ధరతో ఎలా నెట్టుకొస్తామనుకున్నాడో ఏమో ఈ వింత కోరిక కోరాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో గల కాశీపటేల్​గూడెంలో మెస్రం షేక్ కూతురు రేణుక.. నార్నూర్ మండలం కైర్ దటువా గ్రామానికి చెందిన మెస్రం నగేశ్​కు పెళ్లి కుదిరింది.

నగేశ్ కట్నంగా ఎడ్ల బండితో పాటు ఎడ్ల జతను అడిగాడు. ​అవాక్కైన అత్తమామలు ఎడ్ల బండి ఇచ్చి కూతురి పెళ్లి జరిపించారు. వాహనాలతో కాలుష్యం పెరుగుతుందని.. పైగా ఇప్పుడు పెట్రోల్​ రేటు కూడా పెరిగిందని నగేశ్​ అన్నారు. అదే ఎడ్ల బండి అయితే వ్యవసాయానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

కట్నం వద్దు.. ఎడ్ల బండి చాలు

ఇదీ చదవండి: ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.