కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కౌటాలలో ఐదేళ్ల బాలుడు విష జ్వరంతో మృతి చెందాడు. గంగాధర్, వాణి దంపతుల మూడో సంతానమైన విజయేందర్వర్మ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకునే కుమారుడు కళ్లముందే చనిపోవటం వల్ల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: తోట రాముడు... ఇంట్లో కేటీఆర్ శ్రమదానం!