పురపాలక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనున్నందున... పార్టీలు ప్రచార జోరు పెంచాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ భాజపా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. స్థానిక సమస్యలను లేవనెత్తుతూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
పట్టణంలో తొలిసారిగా 30 వార్డుల్లో భాజపా అభ్యర్థులను బరిలో దింపింది. కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని... 29వ వార్డు అభ్యర్థి డాక్టర్ కొత్తపల్లి అనిత తరఫున జిల్లా అధ్యక్షుడు పౌడెల్, మహిళా అధ్యక్షురాలు కుమురం వందన ప్రచారం నిర్వహించారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ