Bandi sanjay comments: రాష్ట్రంలో సోయి లేని పాలన నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహిస్తోన్న భాజపా శిక్షణ తరగతుల శిబిరానికి బండి సంజయ్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫాంహౌస్‌లో కూర్చుని మైకంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడని.. అవి ప్రజలకు శాపాలుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
అసలు సమస్య కేసీఆరే...
bandi sanjay comments on kcr: "70 వేల పుస్తకాలు చదివి కేసీఆర్ మైండ్ క్రాక్ అయినట్టుంది. అందుకే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 317 జీవోతో కన్నీళ్లు వస్తున్నాయి. అయినా సీఎంకు కనికరం లేకుండాపోయింది. పిల్లలను వదిలి భార్య ఓ చోట .. భర్త ఓ చోట పని చేయాలా..? మరోవైపు.. యాసంగి వడ్ల కొనుగోలు పేరిట కొత్త నాటకం షురూ చేశారు. పండిన వడ్లన్ని కొనేది కేంద్రమే. బాయిల్ రైస్ ఇవ్వనని కేసీఆర్ లెటర్ ఇచ్చి.. ఇప్పుడు మెడ మీద కత్తిపెట్టి రాయించారని చెబుతున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ క్యాంటీన్లో బ్యానర్ పెట్టుకొని తెరాస ఎంపీలు ఏం సాధించారు.
వరి వద్దన్నారు.. మరి ఏ పంట వేయాల్నో చెప్పట్లేదు ఎందుకు..? రాష్ట్ర ప్రజలకు అసలు పెద్ద సమస్య సీఎం కేసీఆరే. కేంద్రంను బదనాం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి.. కేసీఆర్ చేస్తున్న జిమ్మిక్కులు ప్రజలు, రైతులు నమ్మరు. రాష్ట్రంలోని రైతులకు, ఉద్యోగులకు భాజపా కచ్చితంగా అండగా ఉంటుంది. వాళ్ల తరఫున పోరాటం చేస్తుంది." -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: