కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జెర్రి గ్రామానికి చెందిన గృహిణి మెస్రం అరుణ ఆసిఫాబాద్లో ఇంటర్ సార్వత్రిక పరీక్షలకు హాజరయ్యారు. ఆరు నెలల వయసున్న కూతురుని తండ్రికి అప్పగించి పరీక్ష రాసేందుకు వెళ్ళింది. చిన్నారిని రెండున్నర గంటల సేపు లాలించడం ఆ తండ్రికి సవాలుగా మారింది. పరీక్ష కేంద్రం ముందు రహదారి పక్కన ఉయ్యాల కట్టి ఆడించాడు. పాలు తాగిస్తూ.. మొత్తానికి పాప ఏడవకుండా చూడటంలో సఫలమయ్యాడు.
ఇవీ చూడండి: సిమెంటు బల్ల మీదపడి బాలుడు మృతి